Bollywood | త‌ల్లికాబోతున్నట్లు ప్ర‌క‌టించిన‌ దీపిక ప‌దుకొనే

Bollywood | త‌ల్లికాబోతున్నట్లు ప్ర‌క‌టించిన‌ దీపిక ప‌దుకొనే

Bollywood | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే – రణవీర్ సింగ్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపికా పదుకొనే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తమ మొదటి కుమార్తె ‘దువా’ ఫోటోతో పాటు ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపిస్తూ ఈ విషయాన్ని పంచుకోవడం ప్రత్యేకత. 2024 సెప్టెంబర్‌లో తమ మొదటి బిడ్డ, కుమార్తె ‘దువా’ (Dua) కు జన్మనిచ్చిన ఈ జంట, సరిగ్గా రెండేళ్ల లోపే రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ అప్డేట్ రాగానే బాలీవుడ్ సహా దక్షిణాది సినీ తారలు దీపికా, రణవీర్ దంపతులపై శుభాకంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్‌తో ‘కింగ్’ మరియు అల్లు అర్జున్‌తో ‘రాకా’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు.

Leave a Reply