Green signal | 114 రఫేల్‌ జెట్‌ల కొనుగోలుకు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌!

Green signal | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం దేశ వైమానిక రంగం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్‌ నుంచి 114 రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు సెంట్రల్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3.25 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు సమాచారం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని డిఫెన్స్‌ కౌన్సిల్ ఇందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

అలాగే.. వాయుసేనే కాదు, మన నౌకాదళం (నేవీ) కూడా ఇప్పుడు మరింత షార్ప్‌గా తయారు కాబోతోంది. సముద్రంలో శత్రువుల కదలికలను ఇట్టే కనిపెట్టే ఆరు పీ-8ఐ (P-8I) నిఘా విమానాలను అమెరికా నుంచి కొనబోతున్నారు. దీనికోసం దాదాపు రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

Leave a Reply