Abhishek| రేపటి మ్యాచ్ ఆడతాడో.. లేడో..?

Abhishek| రేపటి మ్యాచ్ ఆడతాడో.. లేడో..?
- కడుపులో ఇన్ఫెక్షన్
వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు రేపు నమీబియాతో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారని వర్గాలు వెల్లడించాయి. ఈ రోజే డిశ్చార్జ్ అవుతారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరిగే కీలక మ్యాచ్కు అభిషేక్ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
