మీడియా ప్రతినిధులు ఆందోళన..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై అధికారుల సమన్వయ లోపంతో.. అకస్మాత్తుగా అలజడి రేగింది. రాజగోపురం సమీపంలో దుర్గమాతకు పుష్పాలంకరణ చేయలేదని మీడియా స్క్రోలింగ్లో ప్రశ్నించగా… మీడియాపై ఈవో చిందులేశారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు పెడతారా? అని ప్రశ్నించి మీడియా ప్రతినిధిని దుర్భాషలాడారు.
ఇక ఆర్డీవో మాధురి గురువారం ఆలయంలోని మార్గాలన్నింటికీ తాళం వేశారు. అక్కడ ఐదుగురు మహిళ మీడియా ప్రతినిధులు ఇరుక్కుపోయారు. వాష్ రూమ్ కు వెళ్తామని బతిమిలాడినా గేట్లు తెరవలేదు.
ఈ స్థితిలో అధికారుల టెంపరితనంపై మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీ లైనును అడ్డుకుంది. ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ అక్కడకు వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా మీడియా ప్రతినిధులు తమ ఆందోళన విరమించలేదు.
