బిఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి జోరుగా ప్రచారం..

బిఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి జోరుగా ప్రచారం..

వార్డులో ఓటర్లకు కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి

పరకాల, ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ): పట్టణంలోని 15వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం రోజు బిఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి ఆధ్వర్యంలో 15వ వార్డు పరిధిలోని స్వర్ణకార సంఘం వీధి , కూరగాయల మార్కెట్, ఎక్సైజ్ ఆఫీస్ వీధిలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి ఓటర్లను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి షబ్బీర్ అలీ, శ్రీధర్, స్వర్ణకార సంఘం నాయకులు వి కోటేశ్వర్, శరత్, రాము, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.