Award l భారతీయ ప్రొఫసర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు
Award l భారతీయ ప్రొఫసర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు
Award l గన్నవరం, ఆంధ్రప్రభ: ఉన్నతవిద్య పాఠ్యాంశాల బోధనతో పాటు పరిశోథనా పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించే దిశగా నిరంతరం కృషి చేస్తున్న ఉషారామా ఆచార్యులు డాక్టర్ బి.యన్.శ్రీనివాస్ కి గ్లోబల్ ఎక్సలెన్సు పురస్కారం దక్కింది. ఈ అవార్డు ప్రదానం దుబాయ్ లోని ఏకేఎస్ గ్లోబల్ అవార్డ్స్ సంస్థ 2025-26 సంవత్సరానికి గానూ బహూకరించారు. గత మూడు దశాబ్దాలుగా శ్రీనివాస్ రసాయన శాస్త్రవిభాగంలో వాతావరణ కాలుష్య నివారణ పరిశోధనలో అనేక మందికి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేసారు. ప్రొ.శ్రీనివాస్ నీ కళాశాల ఛైర్మన్ సుంకర రామబ్రహ్మం, ప్రిన్సిపల్ జి.వి.కె.ఎస్.వి. ప్రసాద్ అభినందించారు.
