people l ప్రజల కష్టాల్లో నేనుంటా..

people l ప్రజల కష్టాల్లో నేనుంటా..

people l నారాయణపేట ఆంధ్రప్రభ: ప్రజల కష్టాలనే తన కష్టాలుగా భావించి నిజాయితీగా ప్రజా సేవ చేస్తానని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి నందిగామ మంజుల తెలిపారు. అదివారం నారాయణపేట పట్టణంలోని 6వ వార్డులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.యువత రాజకీయాల్లోకి అడుగు పెడితే రాజకీయాల్లో అవినీతి రూపుమాపుతుందని ఆయన పేర్కొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీ పార్టీ మద్దతుతో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తన ఎన్నికల గుర్తు కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని నాయకులు కావాలా, ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకులు కావాలా అన్నది ఓటర్లు ఆలోచించాలని అన్నారు.

24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఓటర్ల కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకరిగా ఉన్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.వార్డులో మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, మొక్కల పెంపకం, ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించడం తన బాధ్యతగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజలు ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే మార్పు ఎలా ఉంటుందో తెలుస్తుందని పేర్కొన్నారు.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply