ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా

  • ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి వినతి పత్రం

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ:
అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని, ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చెప్పారు.

ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు – ఆర్. శ్రీనివాసులు
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఐసిడిఎస్, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురావడం సరికాదన్నారు. ఇది ఐసిడిఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు పేద ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుందని అన్నారు. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ సంబంధంలేని బీఎల్ఓ తదితర అదనపు పనులను రద్దు చేయాలని కోరారు.

5జీ ఫోన్లు సప్లై చేయాలి
అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ఇచ్చిన సెల్ ఫోన్లు నాసిరకంగా ఉండి అవి ఏమాత్రం పని చేయకపోవడం వల్ల అంగన్వాడీ టీచర్లు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే వెనక్కి తీసుకొని 5జీ ఫోన్లు సప్లై చేయాలని కోరారు. పై సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో జరిగే పోరాటాలకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పర్వతాలు, డివైఎఫ్ఐ నాయకులు మధు, కురుమయ్య, సుల్తాన్, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, ప్రభావతి, నిర్మల, అలివేల, వెంకటమ్మ, యాదమ్మ, కృష్ణవేణి, నర్మదా, భాగ్యలక్ష్మి, లక్ష్మి, పార్వతి, వరలక్ష్మీ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply