చెరువు నీటిపై ముదిరాజ్ లను బలి చేయడం సరికాదు

చెరువు నీటిపై ముదిరాజ్ లను బలి చేయడం సరికాదు
తొర్రూరు,ఆంధ్రప్రభ:
హరిద్విరాల గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ లబ్ధి కోసం చెరువు నీటిపై మత్స్యకారులు చేపల కోసం చెరువు నీటిని వదులుతున్నారని దుష్ప్రచారం చేయడం సరి కాదని హరిపిరాల గ్రామ మత్స్య పారిశ్రామిక సంఘం నాయకులు కోరారు. సోమవారం మచ్చ పారిశ్రామిక సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు గ్రామ పెద్ద చెరువు తూము నుండి నీటిని వదులుతున్నారని బదనాము చేయడం బాధాకరమన్నారు.
గతంలో వరి పంటల కోసం రైతులు తూము ద్వారా నీటిని తీసుకున్నారని, అప్పుడు పోయిన నీళ్లు తప్ప తాము నీళ్లు వదల లేదన్నారు. రూము సరిగా లేక నీళ్లు ఆరుతుందన్నారు. ముదిరాజ్ కులానికి చెందిన 100 మంది కుటుంబాలు చేపలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. రైతులకు మత్స్యకారులకు పంచాయితీ పెట్టించే నాయకులకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ముదిరాజులపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు
