18వ వార్డులో పొన్న రవి ప్రచార ప్రభంజనం

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయం దగ్గరపడుతు న్న నేపథ్యంలో 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్న రవి నిర్వహి స్తున్న ఎన్నికల ప్రచారానికి వార్డు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోంది.

ఆదివారం వార్డులోని పలు బస్తీలు, కాలనీల్లో ఆయన తన మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటిం చారు. బస్తీల్లోని వృద్ధులు, మహిళలు పొన్న రవిని చూడగానే ఎంతో ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని మా ఇంటి బిడ్డవు నీవు.. నిన్ను కౌన్సి లర్‌గా తప్పకుండా గెలిపించుకుంటాం రవి అన్న అంటూ భరోసా ఇస్తున్నారు. మా సమస్యలు తెలిసిన వాడివి అంటూ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఓటర్లు అభిప్రాయం తెలుపుతున్నారు.
ఎమ్మెల్యే కడియం సహకారంతో వార్డుకు భారీగా నిధులు:

ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వార్డుకు భారీగా నిధులు రాబట్టి అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తానని అభ్యర్థి రవి తెలిపారు. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోనని స్పష్టం చేశారు. 18వ వార్డును పట్టణంలోనే ఆదర్శ వంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. వార్డులో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలను శాశ్వ తంగా పరిష్కరిస్తానని, నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మా ణం చేపడతానని హామీ ఇచ్చారు.
అలాగే ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాత్రి వేళల్లో ఇబ్బందులు కలగకుండా వార్డులోని అన్ని వీధుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తా నన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి అర్హులైన పేదవాడికి అందేలా కృషి చేస్తానని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో చిలుపూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిశెట్టి బాలరాజు, గడ్డమిది సురేష్, కార్య కర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు.
