15వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం..
15వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం..
ధర్మపురి, ఆంద్రప్రభ : మున్సిపల్ 15వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తో సాధ్యమని 15 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఓజ్జల లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజలు ఒకసారి ఆశీర్వదించి ధర్మపురి కౌన్సిలర్ గా గెలిపించాలని 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఓజ్జల లక్ష్మణ్ ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలు ఒకసారి కౌన్సిలర్ గా గెలిపించి వార్డు అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఒక సేవకునిగా పనిచేస్తూ వార్డు అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో వార్డుకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పాత హరిజన వాడ, తొట్ల వాడ, తమ్మలకుంట లలో మిగిలిన అభివృద్ధి చేస్తానన్నారు ఒక్కసారి ప్రజలు దీవించి గెలిపించాలన్నారు. ఆయన వెంట పెద్ద ఎత్తున వార్డు యువకులు ప్రజలు కదిలి వచ్చారు చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.గతంలో ఎన్నడు లేనివిధంగా అభివృద్ధి చేస్తా అన్నారు
