ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఓటర్లకు సొంత హామీలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఓటర్లకు సొంత హామీలు
- ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మడికొండ శ్రీను
పరకాల, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ): పురపాలక సంఘం ఒకటో వార్డులో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఒకటో వార్డు అభ్యర్థి డాక్టర్ మడికొండ శ్రీను గెలుపుకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డు అభ్యర్థి డాక్టర్ మడికొండ శ్రీను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల తోపాటు ఓటర్లు ఆశీర్వదించి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే తన సొంతంగా హామీలు ఇచ్చి నెరవేరుస్తానని అన్నారు. అభ్యర్థి మడికొండ శ్రీను వార్డులోని ఓటర్లను కలుస్తూ తన సొంత హామీలను వివరించారు. ప్రజలకు అందించే పథకాలు..
ఆడపిల్ల పుడితే 5000/- డిపాజిట్,మొగ పిల్లాడికి ముడ్డిగొలుసు,ఆడపిల్ల సారే పంక్షన్ కు బట్టలు బహుకరించడం,ఆడపిల్ల పెళ్ళికి మా తరపున ఒక్క పుస్తె,
పేదవాడు మరణిస్తే 5000/- దహన ఖర్చులకు,
పేదవాడి మరణం చెందితే 5000/- సమాధి ఖర్చులకు,
పేదవాడి ఫంక్షన్లకు టెంట్ హౌస్ సామాను ఉచితంగా ఇస్తాను అని కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డు అభ్యర్థి డాక్టర్ మడికొండ శీను ఓటర్లకు హామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
