Former MP | బాసర అమ్మవారి సన్నిధిలో మాజీ ఎంపీ

Former MP | బాసర, ఆంధ్రప్రభ : బాసర అమ్మవారి సన్నిధిలో మాజీ ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్ పూజలు బాసర ఫిబ్రవరి 8 ఆంధ్ర ప్రభ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఆదివారం మాజీ ఎంపీ సినీ నటి సినీనటి నవనీత్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న సినీనటి మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ఆలయ అధికారులు సాధన స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలు జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట బిజెపి మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ తదితరులు ఉన్నారు. బైంసా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాసర క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
