కూలీల భద్రత రక్షణకు సౌకర్యాలు ఏర్పాటు..

కూలీల భద్రత రక్షణకు సౌకర్యాలు ఏర్పాటు..
ఉదయం పూటనే పనులు చేయాలి
జైనూర్, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ కూలీల కు పనులు చేసే చోట భద్రత రక్షణకై సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ సర్పంచ్ మడవి కౌసల్య భీమ్రావు, ఉప సర్పంచ్ పేందూరు అనసూయ బాయి రాము అన్నారు. శనివారం దుబ్బగూడా లో ఉపాధి హామీ కూలీలు చేస్తున్న ఉపాధి హామీ పనులను వారు పరిశీలించారు. కూలీల కోసం ఏర్పాటు చేసిన నీడ సౌకర్యం మంచినీటి వసతి ఇలాంటి సౌకర్యాలను పరిశీలించి వారితో మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉందని ఎండలు మధురకముందే పనులు ముగించు కోవాలని అన్నారు. పనులు చేసేటప్పుడు ఎవరికైనా ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలితే ప్రథమ చికిత్స కోసం చికిత్స పరికరాలు అందుబాటులో ఉంచామని వారు తెలిపారు. పనులు చేసేటప్పుడు కూలీలు అలసిపోతే నీడ సౌకర్యంతో పాటు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రయ్య,ఉప సర్పంచ్ పెందుర్ అనుసయబాయి, సీనియర్ మెట్ తుమ్రం జంగు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

