కష్టపడి పని చేసేవాడిని… కౌన్సిలర్ గా గెలిపించండి..

కష్టపడి పని చేసేవాడిని… కౌన్సిలర్ గా గెలిపించండి..
- 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కారుపోతుల వెంకన్న..
మోత్కూర్, ఆంధ్రప్రభ : పేదల కష్టాలు తెలిసిన వాడిని స్వతహాగా కష్టపడి పని చేసే వాడిని కౌన్సిలర్ గా ఒక్కసారి గెలిపిస్తే వార్డు ప్రజల రుణం తీర్చుకుంటానని 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుపోతుల వెంకన్న గౌడ్ తన సతీమణి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ , కల్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించే బాధ్యత తనదేనని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.
ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చెయ్యి గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, మాజీ సర్పంచ్ డాక్టర్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండుగోని రామచంద్రు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్నెపు పద్మ, కాంగ్రెస్ నాయకులు లింగాల జయపాల్ రెడ్డి, కళ్లెం నరసయ్య, కేమిడి సైదులు, లోడే రాజు, బదిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
