ఆలేరు 3 వ వార్డులో సందిల సురేష్ ప్రచారం..

ఆలేరు 3 వ వార్డులో సందిల సురేష్ ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సందిల సురేష్ గౌడ్ శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ ఆయన ప్రచారాన్ని చేపట్టారు. ఆలేరు కాంగ్రెస్ మత్స్య విభాగం అధ్యక్షులు బరిగే శ్రీనివాస్, లోకేష్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
