జిల్లాలో ఉత్తమ క్లబ్‌గా ‘తొర్రూరు లయన్స్ సేవా తరుణి’..
శ్రీదేవి రెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు
2115 సేవా కార్యక్రమాలతో గుర్తింపు.. జిల్లా స్థాయిలో పలు పురస్కారాలు కైవసం
తొర్రూరు: ఆంధ్రప్రభ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఏడాది కాలంలో 2,115 సేవా కార్యక్రమాలు నిర్వహించి తొర్రూరు లయన్స్ సేవా తరుణి జిల్లా ఉత్తమ క్లబ్‌గా నిలిచింది. క్లబ్ అధ్యక్షురాలు తుమ్మూరు శ్రీదేవి రెడ్డి నాయకత్వంలో అభాగ్యులు, పేద విద్యార్థులు, చిరు వ్యాపారులు, సబ్బండ వర్గాల ప్రజలకు విస్తృతంగా సేవలు అందించారు.
ఈ సేవలను గుర్తించిన లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా నాయకత్వం, తొర్రూరు లయన్స్ సేవా తరుణిని జిల్లా ఉత్తమ క్లబ్గా ఎంపిక చేసి అవార్డుతో సత్కరించింది. అలాగే నాయకత్వ ప్రతిభ కనబరిచిన అధ్యక్షురాలు తుమ్మూరు శ్రీదేవి రెడ్డికి ‘డిస్ట్రిక్ట్ అవుట్‌స్టాండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది.
వరంగల్ హంటర్ రోడ్డులోని గోల్డెన్ గార్డెన్‌లో నిర్వహించిన 2025–26 జిల్లా పురస్కారాల కార్యక్రమంలో జిల్లా గవర్నర్ చంద్రశేఖర ఆర్య చేతుల మీదుగా శ్రీదేవి రెడ్డి ఈ అవార్డులను అందుకున్నారు.
అదేవిధంగా క్లబ్‌కు చెందిన కూన పద్మావతి బెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, మంజుల బెస్ట్ ట్రెజరర్, శారద జీఎల్‌టీ కోఆర్డినేటర్, నాగవాణి క్లబ్ ఎక్స్‌టెన్షన్ చైర్‌పర్సన్, కమిటెడ్ లయన్, క్యాబినెట్ మెంబర్ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. వజినపల్లి దీపకు బెస్ట్ జోన్ చైర్‌పర్సన్, వజినపల్లి శైలజకు బెస్ట్ క్యాబినెట్ అవార్డు, ఉమా రెడ్డికి బెస్ట్ కమిటెడ్ లయన్ అవార్డు లభించాయి. అలాగే రెండు పీస్ పోస్టర్ అవార్డులు, బెస్ట్ హంగర్ రిలీఫ్ అవార్డులు కూడా క్లబ్‌కు దక్కాయి.
ఈ సందర్భంగా శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ.. ఏడాది కాలంలో నిర్వహించిన 2,115 సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయని తెలిపారు. తమ సేవలను గుర్తించి జిల్లా ఉత్తమ క్లబ్ అవార్డును అందించడం గర్వకారణమన్నారు. నూతన ప్రతినిధులకు తొర్రూరు సేవా తరుణి స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మహిళలు సంకల్పిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని తమ క్లబ్ నిరూపించిందన్నారు. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
