Balakrishna Birthday | జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జి.ఎల్. శ్రీధర్
Balakrishna Birthday | జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జి.ఎల్. శ్రీధర్
Balakrishna Birthday | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆయన వెండితెరపై కనిపిస్తే థియేటర్లలో ఈలలు, గోలలు.. ఆయన డైలాగ్ చెబితే బాక్సాఫీస్ బద్దలు.. ఆయన నవ్వితే పసిపిల్లాడి స్వచ్ఛత.. ఆయనే నందమూరి వారసత్వాన్ని గుండెల్లో మోస్తూ, కోట్ల మంది అభిమానుల గుండెల్లో ‘బాలయ్య’గా కొలువై ఉన్న నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నేడు ఆయన జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమాన లోకం పండుగ జరుపుకుంటోంది.
Balakrishna Birthday | స్వగృహంలో భావోద్వేగ క్షణాలు..
ఈ పవిత్రమైన రోజున, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బాలకృష్ణ స్వగృహం అభిమానుల కోలాహలంతో, ఆత్మీయ పలకరింపులతో పులకించిపోయింది. తమ ప్రియతమ నాయకుడిని, నటుడిని గుండెలకు హత్తుకోవడానికి అభిమాన సంఘాల నేతలు తరలివచ్చారు. ఆల్ ఇండియా బాలకృష్ణ ఫాన్స్ కన్వీనర్ జి.ఎల్. శ్రీధర్ స్వయంగా బాలకృష్ణ గారిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
కేవలం ఒక అభిమానిగా కాకుండా, బాలయ్య బాబును తమ కుటుంబ సభ్యుడిగా భావించే శ్రీధర్.. భావోద్వేగాల మధ్య నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్నాళ్లుగా తమను ఒక తండ్రిలా, అన్నలా నడిపిస్తున్న బాలయ్య బాబు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని అద్భుతమైన ప్రజా సేవలు, వెండితెర రికార్డులు సృష్టించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
Balakrishna Birthday | నమ్మకానికి.. అభిమానానికి నిదర్శనం..
బాలయ్య బాబు రూపంలో ఉన్న ఆత్మీయతను చూసి అభిమానులు మురిసిపోయారు. ఎన్‌బీకే అంటే కేవలం ఒక పేరు కాదు.. అదొక ఎమోషన్ అని, ఎల్లప్పుడూ బాలయ్య బాబు అడుగు జాడల్లో నడుస్తామని అభిమానులు ఈ సందర్భంగా నినదించారు. సినిమా రంగంలోనే కాకుండా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేదల ప్రాణాలు కాపాడుతూ, హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజల గుండెల్లో నిలిచిన బాలకృష్ణకు ఆంధ్రప్రభ తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
