బలమైన సంస్థాగత నిర్మాణం దిశగా….

బలమైన సంస్థాగత నిర్మాణం దిశగా….

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటి, మండల పరిధిలో నిర్వహించిన బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్ శిక్షణ తరగతుల సమారోప కార్యక్రమం జరిగింది. జిల్లా ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, కార్యపద్ధతి, సంస్థాగత నిర్మాణం గురించి వివరించారు.

ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను లోతుగా అర్థం చేసుకుని ప్రజల మధ్య పని చేస్తూ బలమైన సంస్థ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రభారీ తడిసిన మల్లారెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు నంద గంగేష్, మండల అధ్యక్షులు పూజారి కుమార్,మండల నాయకులు, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబెర్ వడ్డెమాన్ నరేందర్, 5వ వార్డ్ కౌన్సిలర్ పాశికంటి సంపత్, కన్వీనర్లు ఎలగల వెంకటేష్, బైరి మహేందర్ గౌడ్,శేషత్వం అమరేందర్, జిల్లా, మండల,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.