‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియకు వేగం..

ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన

బీఎల్‌ఓలతో కలిసి ఫారాల పంపిణీలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

మేడ్చల్: ఆంధ్రప్రభ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్, గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ తెలిపారు.

ఆదివారం అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ కాలనీల్లో బీఎల్‌ఓలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎస్‌ఐఆర్ ఎన్‌మరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సాయిపేట శ్రీనివాస్, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు ఫారాలను పూర్తిగా నింపి తిరిగి బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్, బుర్కాగాళ్ల శ్రీనివాస్, బీఎల్‌ఓ కిరణ్, ఎక్కడిగాళ్ల కృష్ణ, కొమ్ము కృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.