8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మార్కెట్ చైర్మన్,మున్సిపల్ మాజీ చైర్మన్ ల ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

మోత్కూర్, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ) మోత్కూర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మోత్కూర్ మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత లక్ష్మి నర్సింహారెడ్డి లు శుక్రవారం స్థానిక ఎస్ బి ఐ సమీపంలో 8 వ వార్డు అభ్యర్థి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు సమస్యల పరిష్కారం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు.ఈ నెల 11 న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను చెయ్యి గుర్తు పై ఓటేసి ఆయా వార్డులలోని ఓటర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు డా గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి, నాయకులు పోచం భిక్షపతి,దేవరపల్లి అశోక్ రెడ్డి, టి లక్ష్మి నర్సయ్య,పి స్వామి రాయుడు, కళ్లెం నర్సయ్య,ఎస్ దశరథ ,మడిపెళ్లి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply