Indiramma’s house | సకాలంలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేయాలి
Indiramma’s house | సకాలంలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేయాలి
- విట్టాపూర్ లోని లబ్ధిదారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఎంపీడీవో ఎంపీవో
Indiramma’s house | కుంటాల, ఆంధ్రప్రభ : సకాలంలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేయాలని కోరుతూ శుక్రవారం కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో లబ్ధిదారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అల్లాడి వనజ మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేయకుండా పూర్తిచేసి వేగవంతం అయ్యేటట్టు చూడాలని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు పూర్తయిన వివరాలను పంచాయతీ కార్యదర్శి తో పాటు హౌసింగ్ ఏఈ ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వేగవంతంగా పనులు ఆయేటట్టు కృషి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పలు ఇందిరమ్మ ఇళ్లను పరిశీలన చేశారు. పనుల పురోగతి వేగవంతంగా చేపట్టాలని నిర్మాణ్యం లో అలసత్యం నిర్వహించకుండా పనిచేయాలని కోరారు. విడుదల వారీగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ఎంఏ అబ్దుల్ రహీం, సర్పంచ్ లింగారం పటేల్, ఏపీవో గట్టుపల్లి నవీన్, హౌసింగ్ ఏఈ శైలజ, పంచాయతీ కార్యదర్శి ఉత్తమ్, కారోబారి లక్ష్మణ్, వివో ఏ పూజ, స్థానిక నాయకులు ఎం సాయన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
