ఓటరు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా
బాసర (ఆంధ్రప్రభ): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పరిశీలించేందుకు నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం బాసరలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఓ ఓటరు ఇంటికి వెళ్లి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తిచేసుకున్నారా అని స్వయంగా ఆరా తీశారు.
ఓటరు కల్పన స్పందిస్తూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఫారమ్‌ను పూర్తి చేసి బీఎల్వోకు ఇప్పటికే అందజేసినట్లు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పవనచంద్ర, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
