పట్టుదలకు దక్కిన ప్రతిష్ఠాత్మక అవకాశం..
ఊర్కొండ, ఆంధ్రప్రభ : త్రిబుల్ ఐటీ బాసర సీటు లో మెరిసిన ఊరుకొండపేట విద్యార్థి నౌషీన్ బేగం. ఇటీవలే విడుదలైన పదో తరగతి పరీక్షల్లో మండల టాపరుగా నిలిచిన ఊరుకొండపేట జెడ్పిహెచ్ఎస్ విద్యార్థి నౌషీన్ బేగం త్రిబుల్ ఐటీ బాసరలో సీటు సాధించడం పై గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్, ఎంఈఓ అబ్దుల్ రహీం విద్యార్థినినీ అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి త్రిబుల్ ఐటీ బాసరలో సీటు సంపాదించడంపై వర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఎంఈఓ అబ్దుల్ రహీం మాట్లాడుతూ పట్టుదల, కృషి, ఏకాగ్రతతో ఉంటే మరిన్ని విజయాలు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ఉరుకొండ మండలంలో ఉరుకొండ పేట రాచలపల్లిలో రెండు ప్రీ పైమరి పాఠశాలలు మంజూరయ్యాయని ఇట్టి అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
