ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి భాస్కరరావు…

భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ ; మున్సిపాలిటీ పరిధిలోని పాల్వంచ మండలంలో 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాల్వ భాస్కర్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తనదైన శైలిలో ఓటును అభ్యసిస్తున్నారు. గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ తాను గెలిస్తే డివిజన్లో చేయాల్సిన అభివృద్ధి పనులను ప్రతి ఒక్కటి చేసి చూపిస్తాను అని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. డివిజన్ అభివృద్ధికి ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, విద్యుత్ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు ఇలా పలు వాటిపై ప్రత్యేక దృష్టిసారించి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఆదరించండి గెలిపించండి అంటూ ముందుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Leave a Reply