Encounter | తొమ్మిది మంది మావోయిస్టులు మృతి

Encounter | తొమ్మిది మంది మావోయిస్టులు మృతి
Encounter | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఈ ఆపరేషన్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. గత రెండు రోజులుగా నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
