మెజారిటీతో గెలిపించండి.. వార్డును అభివృద్ధి చేస్తా …

మెజారిటీతో గెలిపించండి.. వార్డును అభివృద్ధి చేస్తా …
- 27వ వార్డులో జోరుగా జైన రమేష్ ప్రచారం …
జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మున్సిపాలిటీ 27 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైన రమేష్ డోర్ టు డోర్ జోరుగా ఇంటింటా ప్రచారం కొనసాగిస్తున్నారు. మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయుటకు ఏకమవుతూ ఇంటింటా ప్రచారంలో నూతన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటా వెళ్లి ప్రజల సమస్యలు వింటూ గెలిపిస్తే 27వ వార్డును మరింత అభివృద్ధి దిశగా పనులు చేపడతామని భరోసా ఇచ్చారు. జనగామ ఎమ్మెల్యే వల్ల రాజేశ్వర్ రెడ్డి సహాయ సహకారంతో సొంతింటికలను, తాగునీటి సమస్యను, వార్డు అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తానన్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ జైన రమేష్ గెలుపే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమం లో గులాబీ శ్రేణులు, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు…
