18వ వార్డులో కాంగ్రెస్ జోరు

18వ వార్డులో కాంగ్రెస్ జోరు

-ప్రతిపక్షాలు బేజారు..దూసుకుపోతున్న పొన్న రవి
-మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను.
-నన్ను ఆశీర్వదించండి..కౌన్సిలర్ గా గెలిపించండి..
-ప్రచారంలో అడుగడుగునా రవికి ప్రజల నుంచి అపూర్వ స్పందన
-గెలుపు ఖాయం అంటున్న ప్రజలు

స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి 6 ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలో పరిధిలోని 18వ వార్డులో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. ప్రతిపక్షాలను పూర్తిగా వెనక్కి నెట్టుతూ హస్తం పార్టీ ప్రచారంలో ముందంజలో దూసుకుపోతోంది. చేతి గుర్తు అభ్యర్థి పొన్న రవి ఇంటింటి ప్రచారంతో ప్రజల హృదయాలను గెలుచుకుంటు న్నారు. శుక్రవారం గడపగడపకు వెళ్లిన రవి ఈ నెల 11న జరిగే పోలిం గ్‌లో చేతి గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించా రు. మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను..మీ ఆశీర్వాదంతో కౌన్సిలర్‌గా గెలిస్తే మాటలకే పరిమితం కాకుండా అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఆయన ప్రజలను ఆశీర్వాదం కోరారు. ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య అండతో 18వ వార్డును అభి వృద్ధి పథంలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దు తానని హామీ ఇచ్చారు. అధి కార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్య మని, ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే ప్రతిపక్ష నాయకుల మాటలకు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని స్పష్టం చేశారు. ప్రచారంలో అడుగడుగునా రవికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రచారానికి తరలివచ్చిన ప్రజలు నిన్నే గెలిపిస్తా మంటూ ధీమా వ్యక్తం చేయడంతో వాతావరణం ఉత్సాహంగా మారిం ది. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిన ఈ ప్రచార సరళిని గమనిస్తున్న విశ్లేషకులు అభ్యర్థి విజయం ఖాయమంటున్నారు.

Leave a Reply