TTD | బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

TTD | బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర
TTD | తిరుమల, ఆంధ్రప్రభ : టీటీడీ ఈవోగా సీఎంవో ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీవారి ఆలయ క్షేత్ర సంప్రదాయాలను పాటిస్తూ భూవరహా స్వామి దర్శనం చేకున్నారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ముద్దాడ రవిచంద్ర ఆలయంలోకి వెళ్లారు.

రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈవో ముద్దాడ రవిచంద్రకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

