Wanaparthy | 33వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా…

Wanaparthy | 33వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా…
Wanaparthy | వనపర్తి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్ ఆదివారం ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తనను గెలిపిస్తే మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వార్డును ప్రగతి పథాన నడిపిస్తానని ఓటర్లను కోరుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో వార్డు పురోభివృద్ధికి కృషి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపించాలని ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
