Tributes | దేశానికి ఆయన సేవలు అనితరసాధ్యం

Tributes | దేశానికి ఆయన సేవలు అనితరసాధ్యం
- టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా
Tributes | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ధైర్యసాహసాలు, పట్టుదలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతీక అని, దేశానికి ఆయన సేవలు అనితరసాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశంసించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతాజీ జయంతిని యావత్ దేశం పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటోందని అన్నారు. అచంచల దేశభక్తికి, భయమే తెలియని నాయకత్వ పటిమకు అసలైన ప్రతీకగా నిలిచే నేతాజీ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

