Gurukula | గురుకులాల దరఖాస్తు గడువు పెంపు

Gurukula | గురుకులాల దరఖాస్తు గడువు పెంపు

Gurukula | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాధారణ, బీసీ, సాంఘీక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ సెట్, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించే బ్యాక్ లాగ్ సెట్ దరఖాస్తు తేదీని జనవరి 21 నుండి జనవరి 25వ తేదీ వరకు పొడిగించడమే కాక దరఖాస్తు చేసిన విద్యార్థినీ విద్యార్థులు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే వాటిని సవరించుకోవడానికి ఈ నెల 25వ తేదీ వరకు అవకాశాన్ని కల్పించారు అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ సేరు శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సదవకాశాన్ని విద్యార్ధినీ విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ సేరు శ్రీధర్ సూచించారు. అర్హులైన పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులు అవసరమైన అన్నీ సర్టిఫికెట్ లతో ఆన్లైన్ ద్వారా గాని లేదా సమీప మీ సేవ కేంద్రాల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

Leave a Reply