900 ration cards | ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం చేయూత
900 ration cards | ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం చేయూత
- లబ్ధిదారులకు 126 చెక్కుల అందజేత
- ఇందిరమ్మ ఇళ్లకు దాదాపు రూ.500 కోట్లు
- ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
900 ration cards | రెంజల్, ఆంధ్రప్రభ : పేద వర్గాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం చేయూత నందిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తహాసీల్ కార్యాలయ ఆవరణలో ఆయన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి 68, షాద్ ముబారక్ 58 మొత్తం 126 చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు (క్యాబినెట్ ర్యాంక్), ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… లబ్ధిదారులకు 126 చెక్కుల గాను రూ.1.3 కోట్ల మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాలలో 910 ఇందిరమ్మ ఇళ్లకు దాదాపు 500 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఒక్కొక్క ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు 200 యూనిట్లు వరకు, రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, పెట్టుబడి సహాయం, రూ.5 వందల బోనస్, డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు,మండలానికి 900 రేషన్ కార్డులు, తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య,బాత్రూం, మరుగుదొడ్లు కోసం లక్షలాది రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
ప్రవేట్ పాఠశాలలో అత్యధిక ఫీజులు కట్టలేక పోతున్నారని అన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డిని నూతన సర్పంచులు శాలువా పూలమాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ తాహేర్ బీన్ హంధాన్, రాష్ట్ర చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, ఇన్చార్జి తహాసిల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీవో వారణాసి కమలాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబిన్ ఖాన్, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు ఆగంటి సురేందర్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు, సాటాపూర్ సర్పంచ్ లచ్చావార్ సుహాసిని, సర్పంచులు తిరుపతి లలిత, డాక్టర్ తెలంగాణ శంకర్, ధనంజయ్,రెమ్మ భానుచందర్, ఈరవోయిన మల్లేష్, ఎత్తరి మాధవి, విజయ్, అశోక్, గియాసోద్దీన్, వాగ్మారే మాధవ్, ఉప సర్పంచులు అబ్దుల్ కుద్దోస్, శీలం మానసా రెడ్డి, అఫ్జల్, బోధన్ అసెంబ్లీ యువజన అధ్యక్షుడు కార్తికేయాదవ్, సీనియర్ నాయకులు జి.సాయారెడ్డి, జావేదోద్దీన్, నరసయ్య, ఏఎంసి డైరెక్టర్ కురుమ శ్రీనివాస్, ఎమ్మెల్ రాజు, పూర్ ఖాన్, ఉబేద్ అలీ, అబ్బోల్లా శ్రీకాంత్, బాబు నాయక్, గణేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
