Dandepally | పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

Dandepally | పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో (2005-06 ) పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారు చదువుకున్న స్కూల్‌లో 26 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపార, ఉద్యోగ తదితర వివరాలతో పాటు కుటుంబ వివరాలను సైతం ఒకరినొకరు పంచుకున్నారు. చదువు చెప్పిన గురువులను సన్మానించుకున్నారు. ఉపాధ్యాయుల కృషి వల్ల ఉద్యోగం చేస్తున్నామని పలువురు కొనియాడారు. చదువుకున్న పాఠశాల నుండి స్థానిక బస్టాండ్ వరకు విద్యార్థులు అందరు ర్యాలీ నిర్వహించి అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంఘర్శ రాజేశ్వర్ రావు, మధుసూదన్, శ్రీనివాస్, సిహెచ్ నర్సయ్య, శంకర్, సత్యనారాయణ, రమణరెడ్డి, నరహరి వరలక్ష్మి శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply