కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకుల చేరిక..

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆధ్వర్యంలో కడెం మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాండవ పూర్ ఉపసర్పంచ్ గొర్రె మధు, వార్డు సభ్యులు బండి మల్లేశ్వరి సురేష్, పాండవ పూర్ యూత్ సభ్యులు ఆర్షం శేఖర్, వంశీ, అజయ్, శివ, హరీష్, బత్తుల సాయి శరన్ తదితరులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నూతనంగా చేరిన నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగేల భూషన్ కాంగ్రెస్ పార్టీ కడం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న జిల్లా ఆర్టీఏ సభ్యులు తుమ్మల మల్లేష్ యాదవ్ పాండవపూర్ గ్రామ సర్పంచ్ ఆడే విజయ ఉత్తర్ పెద్దూరు కడం పెద్ద బెల్లాల్ అంబారిపేట్ గ్రామాల సర్పంచులు దీకొండ విజయకుమార్ ఈదుల తిరుపతి టీ. రమేష్
నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply