Yadagiri Reddy | బెల్ట్ షాపులను మూసివేయాలి….

Yadagiri Reddy | బెల్ట్ షాపులను మూసివేయాలి….
Yadagiri Reddy | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని వెల్మకన్నె గ్రామంలో గ్రామ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మద్యం వద్దు కుటుంబం ముద్దు అనే నినాదంతో ఈరోజు గ్రామంలోని ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చలమల్ల యాదగిరిరెడ్డి మాట్లాడుతూ… మత్తు పదార్థాల వలన యువకుల జీవితాలు బుగ్గి పాలవుతున్నాయని, పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయని, వారి పిల్లల భవిష్యత్తు విద్యాపరంగాను, ఆర్థికంగానూ వెనుకబడిపోతున్నారని సమాజంలో వారికి తగిన గుర్తింపు దక్కట్లేదన్నారు. మద్యం మత్తులో జీవితాలు చిత్తవుతున్నాయని, ఇకనైనా మేలుకొని జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవాలని సూచించారు. గ్రామంలోని బెల్ట్ షాపులు అన్నింటిని మూసివేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
