కన్నీటి పర్యంతమైన నాయకులు
కన్నీటి పర్యంతమైన నాయకులు
రేగొండ , ఆంధ్రప్రభ: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా నాయకులు భావోద్వేగానికి గురయ్యారు. ఘనపురం వాస్తవ్యులు బండారి రాజయ్య కుమార్తె, చక్రవర్తి హాస్పిటల్స్ సీఈఓ సూర్యప్రకాశ్ సోదరి ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలి చిన్న పాపను చూసి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే గండ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మృతురాలికి నివాళులు అర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్. చల్ల గురుగుల సుదర్శన్, నాయకులు. గంగుల రమణారెడ్డి, నిమ్మల విజేందర్, పన్నాటి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వైద్యులు, చక్రవర్తి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
