TUIFD funds | పట్టణం అభివృద్ధి చేసే బాధ్యత మాదే

TUIFD funds | పట్టణం అభివృద్ధి చేసే బాధ్యత మాదే

TUIFD funds | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ నాయకులపైనే ఉందని, అభివృద్ధి చేసే బాధ్యత కూడ మేమే తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి పేర్కొన్నారు. ఈ రోజు పట్టణంలోని 2, 6, 9, 12 వార్డులలో టీయూఐఎఫ్‌డీ నిధులు(TUIFD funds రూ 11.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్, సహకార సంఘాల స్టేట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, స్టేట్ మినరల్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి ల సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఇప్పటికే వార్డుల వారిగా అభివృద్ధి పనులు గుర్తించడం జరిగిందని, పనులు పూర్తి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పర్శ అనంతరావు, సుంకరి సురేష్, పతాని కృష్ణ, ఆయా వార్డుల మహిళలు చంద్రకళ, పద్మ, నవీన, బోదిరే నాగమణి, ప్రేమలత, లక్ష్మి, పద్మ. ఆలకుంట శివరాణి, సుహాసిని, నర్సు, మానస, కట్ట లక్ష్మి, మంజుల, సునీత, సౌమ్య, రమ్య, శ్రీనివాస్, రాజన్న, పెద్ద బాలు, నర్సయ్య, నవీన్, వంశీ, దినేష్, దాసు, నల్లూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply