ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు డబ్బులు ఇవ్వవద్దు..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు డబ్బులు ఇవ్వవద్దు..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వవద్దని బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింగరావు చెప్పారు.
గురువారం ఆయన మాట్లాడుతూ.. కాచాపూర్ గ్రామంలో కొందరు వ్యక్తులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీతో పాటు పార్టీ ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు.
లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రభుత్వం ద్వారా వచ్చే బిల్లులు తీసుకోవాలని సూచించారు. తాము బిల్లులు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కొందరు డబ్బులు వసూలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అట్టి వ్యక్తుల పై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
