వేసవి శిక్షణ తరగతులు ముగింపు

వేసవి శిక్షణ తరగతులు ముగింపు

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండలం చౌటుపల్లి పీఎంస్రీ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం మే 11 నుంచి మే 25 వరకు 15 రోజులపాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు మండల విద్యా వనరుల అధికారి ఎన్. ఆంధ్రయ్య తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మహబూబ్ మాట్లాడుతూ కుట్లు, అల్లికలు, డ్రాయింగ్, యోగా వంటి నైపుణ్యాల ద్వారా విద్యార్థులు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యా వనరుల అధికారి నేర ఆంధ్రయ్య, గ్రామ ఉపసర్పంచ్ విశాల్, వార్డు మెంబర్ రుక్విత్, ఇంచార్జి శ్రీనివాస్, సీఆర్‌పీ బి. అంజయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply