వేం నరేందర్ రెడ్డిని కలిసిన ధర్మపురి సంజయ్
వేం నరేందర్ రెడ్డిని కలిసిన ధర్మపురి సంజయ్
నిజామాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ కాంగ్రెస్ అభ్య ర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని ధర్మపురి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారునిగా వేం నరేందర్ రెడ్డి కొనసా గుతూ, రాజ్యసభకు ఎంపికయ్యారు.
సోమవారం వేం నరేంద ర్ రెడ్డిని నిజామాబాద్ నగర మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు శాలువాతో సన్మానించారు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా మరింత ఎదగాలని, కీలక పదవులు పొందాలని ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ ఆకాంక్షించారు.
