POLICE | డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ జైలు శిక్ష….

POLICE | డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ జైలు శిక్ష….

POLICE | బిక్కనూరు, ఆంధ్రప్రభ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికీ జైలు శిక్ష విధించడం జరిగిందని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంలో పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. కామారెడ్డి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్, మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగిందన్నారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ వారికి వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఒక రోజు జైలు శిక్ష విధించారని చెప్పారు. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడిపినా సహించేది లేదని హెచ్చరించారు.