రామేశ్వర్ పల్లిలో వాలంటీర్ల సమగ్ర సర్వే..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని రామేశ్వర పల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమగ్ర సర్వే నిర్వహించారు.తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిరంలో భాగంగా ఆదివారం 6వ రోజు రామేశ్వర్ పల్లి గ్రామాన్ని డిజిటల్ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సర్వే నిర్వహించి, ప్రతి ఇంటికి జియో-ట్యాగింగ్చేశారు.

అనంతరం వాలంటీర్లు మాట్లాడుతూ సాంకేతిక పరంగా గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సమగ్ర సర్వే చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అంజయ్య, డాక్టర్ హరిత, అధ్యాపకులు డాక్టర్ నారాయణ, డాక్టర్ ప్రగతి, సెక్రటరీ శ్యామ్, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.