Employment | ఉపాధి హామీ, నర్సరీ పనుల ప్రారంభం

Employment | ఉపాధి హామీ, నర్సరీ పనుల ప్రారంభం
Employment | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండలం ఆష్టా గ్రామంలో ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు నర్సరీ పనులను సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో అర్హులైన వారికి పని కల్పించడంతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి(Development) పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు.

అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురుగుల సావిత్ర కోటయ్య, పంచాయతీ సెక్రటరీ గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్, గ్రామ పెద్దలు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.
