మీరు ఆశీర్వదించి వేసే ఓటు.. రేపటి మన అభివృద్ధికి నాంది కావాలి

హస్తం గుర్తుపై వేసే ఓటు పత్తి పకృతి గెలుపు

మంచిర్యాల ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మీరు ఆశీర్వదించి వేసే ఓటు రేపటి మన డివిజన్ అభివృద్ధికి నాంది కావాలని హస్తం గుర్తుపై వేసే ఓటు పత్తి పకృతి వెంకటేష్ గెలుపు తధ్యమని మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ 2 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి పత్తి పకృతి వెంకటేష్ అన్నారు. బుధవారం తన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలతో ఇంటింటా ప్రచారాన్ని ప్రారంభించి పత్తి పకృతి మాట్లాడుతూ.కృష్ణ కాలనీ సింగరేణి బిడ్డల అడ్డా అని కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఇండ్ల పట్టాలు ఇప్పిచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


గత ప్రభుత్వాలు ఇచ్చిన పత్రాలు దేనికి పనికి రాకుండా పోయాయని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నిరసిస్తున్నటువంటి వారికి ఆ ఇంటిపై హక్కును కల్పిస్తూ ధ్రువపత్రాలను అందజేసేందుకు మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ అన్న ఇచ్చిన హామీ తప్పేది లేదని అన్నారు. మంచి మనసున్న పత్తి గట్టయ్య మామ గారి మీద ఉన్న ప్రేమతో మీరందరూ నన్ను బలపరుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. మంచిర్యాల 2వ డివిజన్ లో దశాబ్దాల కాలం నుండి అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులను గుర్తించి కౌన్సిల్లో చర్చించి వాటి కావాల్సిన నిధులను ఎమ్మెల్యే సహకారంతో మంజూరు చేయించి అభివృద్ధిలో మీ బిడ్డగా ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో మాజీ కోఆప్షన్ సభ్యులు నాసర్, నాయకులు మోతే కొమురయ్య,లశెట్టి శ్రీనివాస్,రమేష్,కోరెపు రాజు, తిరుపతి, ఆర్ రాజు,మోతే కళ్యాణి,కవిత మమత తదితరులు పాల్గొన్నారు.