దుర్గమ్మ చరణాలకు చేరుతున్న మంత్ర సౌగంధిక పురాణపండ ‘ శ్రీమాలిక ‘

  • శరన్నవరాత్రులలో భక్తులకు సుజనాచౌదరి కానుక.

విజయవాడ : జీవన వైభవానికి ఎన్నో శ్రేష్ఠతలను , పవిత్రతలను , సౌందర్యాలను చేకూర్చే సుసంపన్నమైన నాలుగు వందల పేజీల అద్భుత గ్రంధం శ్రీమాలిక ను ఈ సంవత్సరం బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొనే దాతలైన భక్తులకు ఉచితంగా అందివ్వాలని సంకల్పంతో సుజనా చౌదరి ఉన్నట్లు , ఈ అంశంపై వేదవిదులతో , ఆలయ డిప్యూటీ కలెక్టర్ సీనానాయక్ తో విజయవాడ పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు , భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి వర్గీయులు పేర్కొంటున్నారు.

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత రచనా సంకలనంగా ఇప్పటికే గత కొంత కాలంగా విశేష సంచలనం సృష్టిస్తూ లక్షల భక్తులకు అత్యంత చేరువైన ఈ శ్రీమాలిక అమృత గ్రంధాన్ని ఈసారి దాతలకు, అఖండ కుంకుమార్చనల్లో పాల్గొనే భక్తులకు సుజనా చౌదరి , శ్రీమతి పద్మ దంపతులు కనకదుర్గమ్మ మంత్రం ప్రసాదంగా అందివ్వాలనుకోవడం అపురూప శుభపరిణామంగా ఆలయ అర్చక వర్గం ఆశీర్వచనాలు ప్రకటిస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా దుర్గమ్మ వారి ఉత్సవాలకు ముందే ప్రఖ్యాత చలన చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతులు దుర్గమ్మ దసరా ఉత్సవాల మంత్ర ప్రసాదంగా ఏటా ఐదు వేల గ్రంధాలను సమర్పిస్తారు. ఈ బుక్ ను కూడా ఎన్నో రమణీయ అంశాలతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రేనివాస్ రచనా సంకలనంగా సమర్పిస్తారు. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల సందర్భంలోనే సాయి కొర్రపాటి తమ అమృతేశ్వరుని ఆలయం సమర్పణలో ‘ అమృత వర్షిణి ‘ అనే రెండు వందల పేజీల పురాణపండ శ్రీనివాస్ రచనను ఆర్ష ధర్మపు ధార్మిక వెలుగుల గ్రంధాన్ని రెండు వేల ప్రతులను ఉచితంగా అమ్మ వారికి అందజేశారు. ఇదిలా ఉండగా సుజనా చౌదరి సమీపబంధువైన పారిశ్రామికవేత్త కానుమిల్లి వేంకట వరప్రసాద్, శ్రీమతి నీరజ దంపతులు పురాణపండ అసాధారణ విలువల వైదిక గ్రంథమైన నాలుగువందల పేజీల ‘ శ్రీమాలిక ‘ ను సుమారు వెయ్యి ప్రతులను భక్త కోటి సౌలభ్యంకోసం అమ్మవారి దేవస్థానం అధికారులకు సుజనా చౌదరి ద్వారా అందించనున్నట్లు సమాచారం.

గత సంవత్సరం కిమ్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన ‘ యుగే యుగే ‘ గ్రంధాన్ని ఇదే దేవస్థానంలో విఖ్యాత ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించి నాటి కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు సమక్షంలో పురాణపండ శ్రీనివాస్ అమోఘ ప్రతిభా సంపత్తిపై అభినందనపూర్వక ఆశీర్వచనాల్ని వర్షించడం విశేషంగానే చెప్పుకోవాలి. మంగళగిరి, బెజవాడ, హైదెరాడ్ , తిరుపతి నగరాలలో ఇప్పటికే పురాణపండ , సాయి కొర్రపాటి అపూర్వగ్రంధాలకు వేలాల్లోంచి లక్షల సంఖ్యలో ఉన్నారనేది నిర్వివాదాంశం.

శ్రీపూర్ణిమ, శ్రీమాలిక వంటి తేజోమయ గ్రంధాల వైభవం అమ్మ వారికృపగానే భావించే పురాణపండ శ్రీనివాస్ ఈ ఏడాదికూడా అమ్మ సాన్నిధ్యానికే సౌజన్యమూర్తుల సమర్పణలో వేల వేల గ్రంధాలను సమర్పించడాన్ని ప్రోత్సహించిన సుజనా చౌదరి, కానుమిల్లి ప్రసాద్ లను ఆలయ వర్గాలు అభినందిస్తున్నాయి.

గత రెండు మాసాల క్రితం దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి భార్య శ్రీమతి నారా భువనేశ్వరి తన స్వహస్తాలతో సుమారు ఏడెనిమిది ‘ శ్రీపూర్ణిమ ‘ గ్రంధాలను పంచి ఆమె సద్భక్తిని నిరూపించుకోవడాన్ని సైతం ఆలయ అర్చక వేద పండితుల బృందం ఈ సందర్భంలో ప్రస్తావించడం దుర్గమ్మ అనుగ్రహమేనంటున్నారు.

శరన్నవ రాత్రుల మొదటి రోజు శ్రీమాలిక ఈ అపురూప గ్రంధాన్ని శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి, సంస్కారవంతుడైన ఉత్సాహవంతుడు సీనానాయక్ కి సుజనా చౌదరి అందజేస్తారు. జ్ఞానమహాయజ్ఞకేంద్రాన్ని దశాబ్దంన్నర క్రితం స్థాపించి , ఇప్పుడొక పవిత్ర వ్యవస్ధగా మలచి , అహోరాత్రాల నిర్విరామ దీక్షతో తరిస్తూ .. నిస్వార్ధ ధార్మిక సేవ చేస్తున్న మహోన్నత ఆధ్యాత్మిక రచయిత పురాణపండ శ్రీనివాస్ స్వచ్ఛ హృదయాన్ని ఉభయ రాష్ట్రాల్లో కులమత ప్రాంతాలకు అతీతంగా అభినందించడం మనకన్నుల ముందు కనిపిస్తున్న సత్యం.

ఏక మొత్తంగా చూసినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఈ ఉత్తమ పదవిలోకి వచ్చాక సుమారు నాలుగు ధార్మిక ఆధ్యాత్మిక గ్రంధాలు పురాణపండ శ్రేనివాస్ వే ఆవిష్కరించడం జయావహ జైత్ర యాత్రగా చెప్పకతప్పదని విజ్ఞులనడం జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థకు ఒక మేలిమలుపు.

Leave a Reply