అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

రెండున్నర కోట్ల విలివ్ చేసే హాష్ అయిల్ స్వాధీనం
ఒడిస్సా నుండి ముంబైకి తరలిస్తున్న ముఠా
4 గురు సభ్యుల ముఠా అరెస్ట్
వివరాలు వెల్లడించిన వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్

వరంగల్ క్రైమ్, ఆంద్రప్రభ : ఒడిస్సా నుండి ముంబైకి గంజాయి మొక్కల నుండి తీసిన రెండున్నర కోట్ల విలువ చేసే హషీష్ ఆయిల్ ను తరలిస్తున్న 4 గురు సభ్యులు గల అంతర్ రాష్ట్ర ముఠాను వరంగల్ కమీషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తోలిసారిగా భారీ స్థాయిలో హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుండి తీసిన నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్టు చేసారు. ఈ ముఠా నుండి పోలీసులు సుమారు 2 కోట్ల 50 లక్షల విలువ గల హాష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన వారిలో హంటల్ సన్ను (23,సువ్వపల్లి గ్రామం, చిత్రకొండ మండలం, మల్కాన్‌గిరి జిల్లా,ఒడిషా), హంటల్ సన్యాసి (23, రేకపల్లి, చిత్రకొండ మండలం, మల్కాన్‌ గిరి జిల్లా,ఒడిషా) కండెల చిన్నబాబు(56,దారకొండ గ్రామం,గూడెం మండలం, అల్లూరి జిల్లా, ఆంధ్రప్రదేశ్), కష్ణా హంటల్ (56,రేకపల్లి, చిత్రకొండ మండలం, మల్కాన్‌గిరి జిల్లా,ఒడిషా) చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీ వున్నాడు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. పట్టుబడిన నిందితులందరు పరిచయస్తులు కాగా, ఇందులో ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన స్వగ్రామంలో గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని మిగితా నిందితుల ద్వారా విక్రయించి సోమ్ము చేసుకుని జల్సాలకు చేసేవారు. కాని నిందితులకు గంజాయి విక్రయాలలతో వచ్చే డబ్బు వారి జల్సాలకు సరిపోక పోవడంతో ప్రధాన నిందితుడు గంజాయి మొక్కల నుండి హాష్ అయిల్‌ను తయారు చేస్తే పెద్ద మొత్తంలో సంపాదించు కోవచ్చునని మరో నిందితుడు కిలో పాండు చెప్పాడు. పాండు ఇచ్చిన సూచనల మేరకు ప్రధాన నిందితుడు మిగితా నిందితులతో కలసి గంజాయి మొక్కలను పెంపకం చేపట్టిన అనంతరం, నిందితుడు పాండు తీసుకవచ్చిన పరికరం ద్వారా ఈ ముఠా సభ్యులు గంజాయి మొక్కలను ద్వారా 40 కిలోల హాష్ అయిల్‌ను సేకరించారు.

ఈ విధంగాంగా తయారు చేసిన హాష్ అయిల్‌లో 20కిలోల హాష్ అయిల్‌ను పాండు తను తీసుకోగా, మిగితా 20 కిలోల హాష్ అయిల్‌ను కిలో చోప్పున ప్యాకేట్లలో భద్రపర్చి పట్టుబడిన నిందితడులందరు ఐదు కిలోల చోప్పున హాష్ అయిల్‌ను తీసుకోని ముంబాయిలో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని తుని రైల్వే స్టేషన్ నుండి ఈ నెల 19 తేది అర్దరాత్రి కోనార్క్ రైలులో బయలు దేరారు. వరంగల్ రైల్వేలో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా ముఠా సభ్యులకు అనుమానం రావడంతో వారు వరంగల్ రైల్వే స్టేషన్‌లో సోమవారం రాత్రి దిగారు.మంగళవారం ఉదయం ముంబాయి వేళ్ళేందుకు ముఠా సభ్యులు వరంగల్ బస్టాండ్ వద్ద వున్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమాస్పదంగా తిరుగున్నట్లుగా పోలీసులకు సమాచారం అందుకొన్నారు. పోలీసులు వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద 20 కిలోల హాష్ అయిల్‌ను పోలీసులు గుర్తించారు.అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

Leave a Reply