6th Ward | ఆలయాలు సంస్కృతికి నిదర్శనం

6th Ward | ఆలయాలు సంస్కృతికి నిదర్శనం

  • ఎస్ఐ మాలోత్ సురేష్,సర్పంచ్ పెదమాముల యాకయ్య

6th Ward | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : సనాతన హైందవ ధర్మానికి, సంస్కృతికి ఆలయాలు నిదర్శనమని నర్సింహులపేట ఎస్సై సురేష్, సర్పంచ్ పెదమాముల యాకయ్య పేర్కొన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర నవగ్రహ ప్రసన్నాంజనేయ స్వామి 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కరపత్రాలను ప్రధాన అర్చకులు శ్రీ దేవేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఆలయాలను సంరక్షించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కాస యాకయ్య, 6వ వార్డు సభ్యురాలు షేక్ హసీనా, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ లు మంచినీళ్ళ లక్ష్మి నారాయణ, బొల్లం రమేష్ బాబు, వేముల నరసింహా రెడ్డి, బోల్లోజు శ్రీనివాసచారి, ఎర్ర వెంకట్ రాం నర్సయ్య, ఎరనాగి వెంకన్న, దోమల యాదగిరి, లెక్కల సంపత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply