ఘనంగా ప్రపంచశాంతి కోరుతూ కవి సమ్మేళనం..

ఘనంగా ప్రపంచశాంతి కోరుతూ కవి సమ్మేళనం..

వరల్డ్ పీస్ సొసైటీ తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో .. నిర్వహణ

హన్మకొండ ,తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ హన్మకొండ – వరంగల్ శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జాతీయ బహు భాష కవిత సమ్మేళనాన్ని ఆదివారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ వరంగల్ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రపంచ స్వరాలు , ప్రజా ఐక్యత రాగాలు మరియు కవిత్వం ద్వారా ప్రజలను ఐక్యం చేయడానికి ఉద్దేశించి దేశ నలుమూలల నుంచి ఉర్దూ హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషలో ఉన్న కవులను రచయితలను ఆహ్వానించడం జరిగిందని వారు తమ సృజనాత్మకమైన ప్రతిభను పంచుకోవడానికి వేదికగా ఈనాటి కనీసం ఉపయోగపడుతుందని అన్నారు. తనకు కాలేజీ గారితో ఉన్న అనుబంధాన్ని పద్య కవిత గజల్ ప్రక్రియలో చక్కగా వివరించారు కవులు రచన శక్తిని పెంచుకొని కవిత్వంలో పట్టుత్వాన్ని ఎలా పెంచుకోవాలో సూచనలు చేశారు ఈ కార్యక్రమానికి రవి, పోతన ,మహబూబ్నగర్ కరీంనగర్ ,ఎటునాగారం, భూపాలపల్లి ,ఖమ్మం, తొర్రూరు ,ఉమ్మడి వరంగల్ జిల్లా తదితర ప్రాంతాల నుంచి మరి 100 మంది పైగా ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు.