6th over | మైదానంలో గాయపడ్డ మరో స్టార్ బౌలర్

6th over | మైదానంలో గాయపడ్డ మరో స్టార్ బౌలర్

6th over | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (2026) సీజన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆటగాళ్లు గాయాలపాలవుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడికి తలకు తీవ్ర గాయం కాగా, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అకీల్ హుస్సేన్ కూడా మైదానంలో గాయపడ్డాడు. చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇన్నింగ్స్ 6వ ఓవర్లో గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద క్యాచ్ అందుకునే క్రమంలో అకీల్ హుస్సేన్ డైవ్ చేశాడు. ఈ ప్రయత్నంలో బంతి చేజారడమే కాకుండా, బ్యాలెన్స్ తప్పి అతని ముఖం నేలను బలంగా డీకొట్టింది. ముఖానికి గట్టి దెబ్బ తగలడంతో నొప్పితో విలవిలలాడుతూ అతడు మైదానంలోనే ఉండిపోయాడు. వెంటనే స్పందించిన మెడికల్ సిబ్బంది గ్రౌండ్‌లోకి వచ్చి కంకషన్ ప్రొటోకాల్స్ నిర్వహించారు. కాసేపు ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత అతడు కోలుకోవడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం హుస్సేన్ మళ్లీ ఆటకు సిద్ధమయ్యాడు.

Leave a Reply